నమ్రత గురించి మీకు తెలియని రీల్ & రియల్ లైఫ్ సీక్రెట్స్!

బాలీవుడ్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు తెలుగు ప్రజల్లో ఎక్కువ మందికి తెలిసింది. ఉత్తర భారతీయ సంస్కృతికి అలవాటుపడిన ఈమె తెలుగింటి కోడలుగా నెట్టుకొస్తుందా? అని కృష్ణ అభిమానులంతా అనుమానపడ్డారు. వివాహం అనంతరం ఇంటికే పరిమితమై మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రిన్స్ కి తగ్గ భార్యగా నమ్రత నిరూపించుకుంది. ఆమె గురించి మీకు తెలియని కొన్ని విషయాలు…

1 . నమ్రత మహారాష్ట్రీయుల కుటుంబంలో జన్మించింది. ఆమె పూర్వీకులకు సినిమాలతో అనుబంధముంది. నమ్రత అమ్మమ్మ ప్రముఖ మరాఠీ నటి మీనాక్షి శిరోద్కర్. అనేక సినిమాలు చేశారు.1938 లో వచ్చిన బ్రహ్మచారి సినిమాలోనూ హీరోయిన్ గా నటించారు.2 . నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా నటిగా కొన్ని చిత్రాలు చేసింది. డైలాగ్ కింగ్ మోహన్ బాబు బ్రహ్మ సినిమాలో నటించి మెప్పించింది.3 . మొదట మోడలింగ్ లో అడుగు పెట్టిన నమ్రత అనేక ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. 1993 లో మిస్ ఇండియా కిరీటం అందుకున్నారు.4 . 1998 లో నమ్రత బాలీవుడ్ లో అడుగు పెట్టారు. వాస్తవ్ సినిమాతో ఫామ్లోకి వచ్చారు. హిందీ, మలయాళం, మరాఠీ, తెలుగు భాషల్లో మొత్తం 25 చిత్రాల్లో నటించారు.5 . తెలుగులో వంశీ సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు ఒకటి కావడంతో ప్రేమించుకున్నారు. మహేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో నమ్రత కుటుంసభ్యుల సమక్షంలో ముంబై లో ఫిబ్రవరి 10 , 2005 న పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార.6 . నమ్రత(44 ), మహేష్(41 ) కంటే మూడేళ్లు పెద్దది. నమ్రత పుట్టిన రోజు జనవరి 22 1972 . ఆగస్టు తొమ్మిది 1975 న మహేష్ బాబు జన్మించారు. అయినా ఇద్దరూ ఫర్ఫెక్ట్ జోడీగా ఉంటారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus