అభిమానులకు వినోదాన్ని పంచడాన్ని బాధ్యతగానే భావిస్తారు – నమ్రత

సమాజం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని భరత్ అనే నేను సినిమాలో మహేష్ చెబుతారు. సినిమాలోనే కాదు.. బయట కూడా మహేష్ అనేక విషయాల్లో బాధ్యతగా ఉంటారు. ఒక కొడుకుగా.. తమ్ముడిగా.. భర్తగా.. తండ్రిగా.. కుటుంబసభ్యుల పట్ల ఎంతో బాధ్యతతో ఉంటారు. అంతేకాదు అభిమానుల పట్ల కూడా బాధ్యతతో ఉంటారని తెలిసింది. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ చెప్పారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను గతవారం రిలీజ్ అయి 161 కోట్ల గ్రాస్ రాబట్టింది. మహేష్ ని అద్భుతమైన విజయాన్ని అందించింది. ఈ సంతోషాన్ని మహేష్ అభిమానాలతో కలిసి పంచుకుంటున్నారు. ఇక నమ్రత కూడా చాలా ఆనందంగా ఉన్నారు. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ గురించి ఆసక్తికర విశేషాల్ని బయటపెట్టారు. “మహేష్ బాబుకు తన అభిమానుల్ని నిరుత్సాహపరచడం అస్సలు ఇష్టడం ఉండదు.

ఎప్పుడూ వారి పట్ల ఒక భాద్యతను ఫీలవుతారు. గత రెండు సినిమాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ ఫ్లాప్ అవ్వడంతో తనను తానే ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానం ‘భరత్ అనే నేను’తో దొరికింది.” అని వెల్లడించారు. ఇంకా తనపై వచ్చిన రూమర్లను కొట్టి పడేశారు. ” మహేష్ కెరీర్ పై నా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అన్ని నిర్ణయాలు నావేనని అందరూ అనుకుంటుంటారు, కానీ అలాంటిదేం లేదు. ఆయన సొంత నిర్ణయాలు ఆయనకుంటాయి. సినిమాలు, ప్రకటనలు అన్నీ ఆయన ఇష్టాలే. సినిమా కథల గురించి మాత్రం నాతో క్యాజువల్ గా మాట్లాడుతుంటారు. ఏదైనా తుది నిర్ణయం ఆయనదే” అని నమ్రత క్లారిటీ ఇచ్చారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus