Namrata, Manjula: మహేష్ తో నా పెళ్లి జరగడానికి ఆమె కారణం!

  • August 19, 2022 / 05:30 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు సైతం ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు నటి నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వంశీ సినిమాతో నమ్రతతో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

నమ్రతం వివాహమైన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండి కేవలం కుటుంబ బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా పిల్లల ఆలనా,వారి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ నిత్యం తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మహేష్ బాబు సోదరి మంజుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ మహేష్ బాబు సోదరి మంజుల తన పెళ్లి విషయంలో చాలా కీలకంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.నేను మంజుల మొదటిసారి ఒక పార్టీలో కలిసామని అయితే అప్పటికి తాను మహేష్ బాబును ప్రేమిస్తున్న విషయం తనకు తెలియదని ఈమె తెలిపారు.అయితే ఈ విషయం అనంతరం తనకు తెలియడంతో మా పెళ్లి విషయంలో ఎంతో సహాయం చేసిందని నమ్రత వెల్లడించారు. ఇక మంజుల గురించి మాట్లాడుతూ తాను నా ఫ్యామిలీ అనే కాదు తను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈమె తనతో ఉన్న రిలేషన్ గురించి వెల్లడించారు.

ఇక పిల్లల గురించి నమ్రత మాట్లాడుతూ మొదట్లో మంజులకు పిల్లలను కనడం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే యాదృచ్ఛికంగా ఇద్దరం ఒకేసారి ప్రెగ్నెంట్స్ అయ్యామని ఈమె వెల్లడించారు.ఇలా పిల్లలు కనడానికి ఇష్టం లేకపోయినా మంజుల ప్రస్తుతం ఒక కూతురికి తల్లిగా మారి తన కూతురితో ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంజుల గురించి తనతో ఉన్న రిలేషన్ గురించి నమ్రత ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus