ఇన్స్టాగ్రామ్ యూజర్ కి నమ్రత స్ట్రాంగ్ రిప్లై

సోషల్ మీడియా అనేదానివల్ల సమాజానికి ఎంత ఉపయోగమో తెలియదు కానీ.. ఆ సోషల్ మీడియాను మంచిగా కంటే చెడుకు ఉపయోగించడమే ఎక్కువైపోయింది. ఒక మనిషిని పొగడడం కంటే.. ఆ మనిషిని తిట్టడానికి లేదా మానసికంగా వ్యధను కలిగించడానికే ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నాం. ఇక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి పబ్లిక్ ప్లాట్ ఫార్మ్స్ మీద.. ప్రతి ఒక్కరికీ ఎవరి మీదైనా కామెంట్ చేయడానికి ఆప్షన్ ఉండడంతో.. ఒక్కొక్కరూ ఒక్కో రేంజ్ లో రెచ్చిపోతున్నారు. నిన్నమొన్నటివరకూ కేవలం హీరోయిన్లు లేదా హీరోల మీద మాత్రమే కాన్సన్ ట్రేట్ చేసిన ఈ సోషల్ మీడియా ట్రోలర్స్ ఇప్పుడు వారి కుటుంబ సభ్యులా మీద కూడా పడుతున్నారు.

మహేష్ బాబు కెరీర్ తోపాటు ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా మైంటైన్ చేసే ఆయన సతీమణి నమ్రత.. మహేష్ బాబు కంటే ఎక్కువగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పడప్పుడు మహేష్ బాబు ఫోటోలు మరియు ఆయన పర్సనల్ ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమాలను అలరిస్తుంటుంది. అయితే.. ఆమె పెట్టే ఫోటోల కింద కొందరు అభిమానులు, ఇంకొందరు నెటిజన్లు కామెంట్స్ పెట్టడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ.. ఒక వ్యక్తి కాస్త లిమిట్ క్రాస్ చేసి నమ్రత పోస్ట్ చేసిన ఒక ఫోటో కింద “నమ్రత నువ్ ఎందుకని మేకప్ వేసుకోవు.. ఆదేమైనా ఫోబియానా లేక డిప్రెషనా?” అని ప్రశ్నించాడు ఓ కుర్రాడు.

మామూలుగా ఇలాంటివి పెద్దగా పట్టించుకొని నమ్రత హర్ట్ అయ్యిందో లేక ఆ కుర్రాడికి బుద్ది చెప్పాలనుకొందో గానీ కాస్త గట్టిగానే స్పందించింది. “నీకు మేకప్ వేసుకొన్న అమ్మాయిలంటేనే ఇష్టమేమో. అలాంటప్పుడు అలా మేకప్ వేసుకొనే వాళ్ళనే ఫాలో అవ్వాలి. ఈ పేజ్ లో నీకు మేకప్ తో ఫోటోలు కనిపించే ప్రసక్తే లేదు. సొ నువ్వు ఈ పేజ్ నుంచి బయటకు వెళ్తేనే బెటర్.. సిన్సియర్ రిక్వెస్ట్” అని రిప్లై ఇచ్చింది. నమ్రత రిప్లైకి అందరూ వత్తాసు పలికారు. 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలిచిన నమ్రత తాను ప్రేమించిన మహేష్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు స్వస్తిపలికి మహేష్ కు ఒక సపోర్ట్ సిస్టమ్ లా మారిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus