Balakrishna: ట్రెడిషనల్ లుక్ లో అదుర్స్ అనిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) గడిచిన నాలుగు సంవత్సరాలలో ఏకంగా మూడు సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి మూడు సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాలు థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణ పొందడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బాబీ (Bobby) డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒకింత కన్ఫ్యుజన్ నెలకొంది. స్టార్ హీరో బాలయ్య ఒకప్పుడు యాడ్స్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

బాలయ్య తాజాగా ఒక జ్యూయలరీకి సంబంధించిన యాడ్ లో నటించగా ఆ యాడ్ లో బాలయ్య లుక్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పంచెకట్టులో బాలయ్య లుక్ అదిరిపోయిందని బాలయ్య ఈ ఫోటోలలో కొత్తగా కనిపిస్తున్నారని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య ఇదే లుక్ లో ఫ్యామిలీ డ్రామాలో నటిస్తే బాలయ్య ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరే అవకాశాలు అయితే ఉంటాయి.

Balakrishna

నందమూరి బాలకృష్ణ (Balakrishna) అఖండ2 సినిమాను ఎప్పుడు మొదలుపెడతారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండగా ఈ ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. 35 కోట్ల రూపాయలకు అటూఇటుగా బాలయ్య పారితోషికం ఉండటం గమనార్హం. బాబీ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా స్థాయిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇతర భాషల్లో బాలయ్య సినిమాలు హిట్టైతే బాలయ్య మార్కెట్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఏ పాత్రలో బాలయ్య నటించినా నూటికి నూరు శాతం న్యాయం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు జరగనుండగా ఈ వేడుకలు ఒకింత గ్రాండ్ గా జరగనున్నాయి. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus