తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) సినిమా వస్తుందంటే.. అక్కడి ప్రేక్షకులు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చాయి. ‘తుపాకీ’ (Thupaki) నుండి విజయ్ (Thalapathy Vijay) సినిమాలు తెలుగులో కూడా బాగా ఆడుతున్నాయి. ‘మాస్టర్’ (Master) ‘వారసుడు’ (Varisu) ‘లియో’ (LEO) వంటి సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. ‘లియో’ అయితే నెగిటివ్ టాక్ తో కూడా ఇక్కడ రూ.25 కోట్లు షేర్ ను కొల్లగొట్టింది. గ్రాస్ పరంగా కూడా రూ.50 కోట్ల మార్క్ ను దాటేసింది.
దీంతో అతని నెక్స్ట్ సినిమా ‘గోట్'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్స్) (The Greatest of All Time ) సినిమాకి థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. తెలుగులోనే ఈ సినిమా రూ.30 కోట్ల వరకు బిజినెస్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పోటీగా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) తప్ప మరో సినిమా లేదు. అది కూడా వారం ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) గత సినిమా ‘కస్టడీ’ (Custody) ప్లాప్ అయ్యింది. ‘గోట్’ ట్రైలర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు.
కానీ వెంకట్ ప్రభు సినిమా అంటే మ్యాజికల్ స్క్రీన్ ప్లే హైలెట్ అవుతుంది. అందువల్ల సినిమాని కొంచెం ప్రమోట్ చేసినా ఓపెనింగ్స్ బాగా వస్తాయి. విజయ్ (Thalapathy Vijay) ఒక్కసారి హైదరాబాద్ వచ్చి.. ప్రమోషన్ చేసినా సరిపోతుంది. కానీ అతను తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఫోకస్ చేయడు. ఏదో నామమాత్రంగా సినిమాలు వదులుతూ ఉంటాడు. మరి అతనికి తెలుగు ప్రేక్షకులంటే అంత చిన్న చూపు ఏంటో.