‘అన్ స్టాపబుల్ 2’ టీజర్ : చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ల సందడి మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ సీజన్ 1’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇండియా వైడ్ ఈ టాక్ షో సంచలనం సృష్టించింది అనే చెప్పాలి. ఇక సీజన్ 2 కోసం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు సర్వం సిద్ధమైంది. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు గెస్ట్ లుగా విచ్చేసారు.

అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 5 నిమిషాల 31 సెకన్ల నిడివితో ఈ ప్రోమో ఉంది. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే చెప్పాలి. ‘మీ జీవితంలో మీరు చేసిన రొమాంటిక్ పని ఏంటి?’ అని బాలయ్య చంద్రబాబుని అడగ్గా..’మీ కంటే ఎక్కువే చేశాను.. మీరు సినిమాల్లో చేశారు నేను కాలేజీలో చేశాను’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. అలాగే ఇంకా ఎన్నో సరదా ప్రశ్నలు చంద్రబాబుని అడిగారు బాలయ్య.

‘మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు’ అని బాలయ్య అడగ్గా.. ‘రాజశేఖర్ రెడ్డి’ అంటూ చంద్రబాబు బదులిచ్చారు. ఇది అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసింది. అలాగే 1995 లో వైస్రాయ్ హోటల్ వద్ద సీనియర్ ఎన్టీఆర్ విషయంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాన్ని కూడా చంద్రబాబు వివరించారు. ‘ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా.. కాళ్ళు పట్టుకుని అడిగాను’ అంటూ చంద్రబాబు చెప్పిన సమాధానం ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేలా చేసింది.

తర్వాత లోకేష్ కూడా వచ్చి మరింత ఫన్ జెనరేట్ చేశారు.ఓ సందర్భంలో బాలయ్య ‘తండ్రీకొడుకులు నా సంసారంలో నిప్పులు పోసేలా ఉన్నారు’ అంటూ అనడం నవ్వులు పూయించింది. ఈ ప్రోమోని లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!


ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus