Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని హామీ ఇచ్చిన బాలయ్య.. కానీ?

  • April 11, 2023 / 12:10 PM IST

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సైతం 2023లోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ కు హామీ ఇవ్వడం జరిగింది. ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అయితే నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో చూడాల్సి ఉంది.

మోక్షజ్ఞ (Mokshagna) మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే మోక్షజ్ఞ ఇప్పటినుంచే తన వీడియోల ద్వారా, ఇంటర్య్వూల ద్వారా అభిమానులకు దగ్గరైతే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ హామీ ఈ ఏడాదే నెరవేరుతుందో లేదో క్లారిటీ రావడం లేదు. మోక్షజ్ఞ వయస్సు ప్రస్తుతం 28 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోక్షజ్ఞ మాస్ ఇమేజ్ పై దృష్టిపెడతారో లేక క్లాస్ ఇమేజ్ పై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది. మోక్షజ్ఞ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు. మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ తొలి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో సొంత బ్యానర్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ తొలి ప్రాజెక్ట్ లో రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus