Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘ డెవిల్ ‘ గురించి ఆసక్తికరమైన అప్డేట్!

Advertisement

కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం డెవిల్. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందిన మూవీ అంటే బింబిసార మాత్రమే చెప్పుకుంటూ వచ్చాము. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను సాధించి కళ్యాణ్ రామ్ కు మంచి మార్కెట్ ఏర్పడేలా చేసింది. నిర్మాతలకు కూడా కళ్యాణ్ రామ్ సినిమా పై బడ్జెట్ పెట్టొచ్చు అనే నమ్మకాన్ని కల్పించింది.

అయితే బింబిసార సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ‘డెవిల్’ అనే సినిమాని స్టార్ట్ చేశారు అభిషేక్ నామా. కథ పై ఆయనకు అంత నమ్మకం ఉందని ఇటీవల రావణాసుర ప్రమోషన్లలో ఆయన చెప్పుకొచ్చారు.అంతే కాదు డెవిల్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని ఆయన బయటపెట్టాడు. అభిషేక్ నామా మాట్లాడుతూ..’ కళ్యాణ్ రామ్ గారికి అంత బడ్జెట్ పెట్టడానికి నేను ముందుకు రావడం వెనుక డెవిల్ కథ పుషింగ్ ఉంది తప్ప ఇంకేమీ కాదు.

ఆ సినిమా చాలా బాగా వచ్చింది. డెవిల్ కి సీక్వెల్ కూడా ఉంటుంది. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. లేదంటే డెవిల్ రిలీజ్ టైంలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇక డెవిల్ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని తెలుస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus