Mokshagna: అఖండ 2 లో మోక్షజ్ఞ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్?

  • January 9, 2024 / 06:07 PM IST

నందమూరి వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అధిక మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఇన్ని రోజులపాటు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాటలు వినపడుతూనే ఉన్నాయి తప్ప ఇప్పటివరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఖరారు అయినటువంటి సందర్భాలు లేవనే చెప్పాలి. ఇకపోతే మోక్షజ్ఞ కాస్త శరీర బరువు ఎక్కువగా ఉండటంతో ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం ముందు ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారని తెలియజేశారు.

ఇక బాలకృష్ణ కూడా పలు సందర్భాలలో మరో ఏడాదిలో మోక్షజ్ఞ వెండి తెరపై సందడి చేయబోతున్నారు అంటూ కూడా తెలియజేశారు. ఇక మోక్షజ్ఞ కూడా హీరో కటౌట్ కి అనుగుణంగా తన బాడీని మలుచుకున్నారని కూడా తెలిసిందే. ఇలా ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అసలు ఏ డైరెక్టర్ తనని ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఇకపోతే తాజాగా మోక్షజ్ఞ (Mokshagna) సినీ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని ఇక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలుస్తుంది. మోక్షజ్ఞ ఏ సినిమా ద్వారా రాబోతున్నారు ఎవరు ఇతనిని లాంచ్ చేయబోతున్నారనే విషయానికి వస్తే ఈయన పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంలేదని తెలుస్తోంది. ముందుగా తన తండ్రి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్నటువంటి అఖండ 2లో కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతుందని ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం బోయపాటి స్పెషల్ రోల్ సిద్ధం చేశారనే వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus