‘బిగ్ బాస్ -2’ లో పార్టిసిపేట్ చేయనున్న నందమూరి హీరో

“ఏదైనా జరగవచ్చు..” అవును బిగ్ బాస్ రియాలిటీ షోలో ఏ క్షణం ఏమి జరుగుతుందో.. పార్టిసిపెంట్స్ మధ్య వైరం పుడుతుందో.. ప్రేమ చిగురిస్తుందో ఎవరూ చెప్పలేము. పైగా.. ఈ సారి మసాలా ఎక్కువగా ఉంటుందని నేచురల్ స్టార్ నాని చెప్పకనే చెప్పేసారు. స్టార్ మా ఛానల్ వాళ్ళు నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో నందమూరి హీరో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి సూపర్ హిట్ చేయించారు. ఇప్పుడు హోస్ట్ గా నాని వ్యవహరిస్తున్నారు. ఇందులో 16 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. వారి పేర్లను ఇప్పటి వరకు ఛానల్స్ వాళ్లు అధికారికంగా బయటపెట్టలేదు. కానీ హీరో తరుణ్, క్రేజీ సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలా, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశి, గజాలా, తేజశ్వి తదితరులు పాల్గొనబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ జాబితాలోకి నందమూరి హీరో తారకరత్న పేరు వచ్చి చేరింది. వెండితెరపై హీరోగా నిలదొక్కుకోకపోయిన ఈ హీరో.. విలన్ గాను ప్రయత్నించారు. అయినా మంచి బ్రేక్ రాలేదు. సో ఈ షోలో పాల్గొని బుల్లితెరప్రేక్షకులకు దగ్గరకావాలని చూస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఈ నెల 10 వ తేదీ వరకు ఆగాల్సిందే. అప్పుడే వందరోజుల కౌంట్ డౌన్ మొదలుకాబోతోంది. ఈసారి హైదరాబాద్ లోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేశారు. తొలిసారి ఇక్కడ జరుగుతున్న ఈ షో ఎన్ని విజయాలకు, వివాదాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus