డైరెక్టర్, నిర్మాత, స్టోరీ రెడీ.. హీరో మాత్రం దొరకడం లేదు

  • March 12, 2021 / 04:43 PM IST

కొందరు డైరెక్టర్లకు చిత్రవిచిత్రమైన కష్టాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి హీరో, ప్రొడ్యూసర్ రెడీగా ఉంటారు కానీ మంచి కథ దొరక్క ప్రొజెక్ట్స్ ఆగిపోతాయి. కథ-హీరో రెడీగా ఉంటే నిర్మాత దొరక్క కొన్ని ప్రొజెక్ట్స్ మరుగునపడిపొతాయి. అయితే.. నందినిరెడ్డికి మాత్రం సరికొత్త కష్టం వచ్చింది. “ఓ బేబీ” బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మళ్లీ మరో ప్రొజెక్ట్ స్టార్ట్ చేయలేదు నందిని. నెట్ ఫ్లిక్స్ కోసం చేసిన “పిట్ట కథలు” సిరీస్ లో ఆమె తెరకెక్కించిన “మీరా” ఎపిసోడ్ కు మంచి స్పందన వచ్చినప్పటికీ..

సిరీస్ కి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ లో అది కొట్టుకుపోయింది. దాంతో సంబంధం లేకుండా స్వప్న సినిమా బ్యానర్ తో నందిని ఒక సినిమా కమిట్ అయ్యింది. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఎప్పుడో మొదలైంది. అయితే.. ఇప్పటివరకూ నందినిరెడ్డి రాసుకున్న కథ-క్యారెక్టర్ కు తగ్గ హీరో మాత్రం దొరకడం లేదట. మొదట్లో కొత్త హీరోతో ట్రై చేద్దామని చేసిన ఆడిషన్స్ ఔట్ పుట్ బాలేకపోవడంతో యంగ్ హీరోతోనే ప్రొసీడ్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే..

ప్రస్తుతం యువ హీరోలందరూ ఎదో ఒక ప్రొజెక్ట్ లో బిజీ అయిపోవడంతో ఇప్పుడెవర్ని ఫైనల్ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతుంది నందినిరెడ్డి. మరి ఈ సక్సెస్ ఫుల్ లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో నటించబోయే ఆ యువ కథానాయకుడు ఎవరో, సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus