రొమాంటిక్ థ్రిల్లర్ తో నందు రీఎంట్రీ!!

నటుడిగా కంటే ప్రముఖ సింగర్ గీతామాధురి భర్తగానే ఎక్కువ ఫేమస్ అయిన నందు.. ఆ మధ్య “రభస, ఆటోనగర్ సూర్య” వంటి సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించి ఫర్వాలేదనిపించుకొన్నాడు. ఇక ఆ తర్వాత ఆర్జీవి దర్సకత్వంలో “ఐస్ క్రీమ్ 2, 365 డేస్” సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అనంతరం మనోడికి అవకాశాలు దూరమయ్యాయి.

దాంతో “వై నాట్ ఎ గర్ల్, పోవే పోరా” వంటి షార్ట్ ఫిలిమ్స్ చేసుకొంటూ సమయం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు మళ్లీ కథానాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. “వై నాట్ ఎ గర్ల్” షార్ట్ ఫిలిం ను చిత్రీకరించిన బృందం నందు హీరోగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది, ఈ సినిమా తనకు హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు నందు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags