నాని 21 సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్
- July 15, 2017 / 06:22 AM ISTByFilmy Focus
నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమాతో డబుల్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కలక్షణాల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లోను వన్ మిలియన్ డాలర్ క్లబ్ లోఈ మూవీ చేరింది. ఈ విజయాన్ని ఆస్వాదించకుండానే దిల్ రాజు నిర్మాణంలో MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాని నాని ప్రారంభించారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ సెట్స్ పై ఉండాగానే మరో యువ దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కథకు ఓకే చెప్పారు. ఆ విషయాన్నీ నాని ట్విట్టర్లో అధికారికంగా ప్రకటించారు.
గాంధీ దర్శకత్వంలో 21 వ ప్రాజక్ట్ చేస్తున్నాను.. ఈ చిత్రం పేరు “కృష్ణార్జున యుద్ధం” అని వెల్లడించారు. దీంతో ఇందులో నాని డ్యూయల్ రోల్ పోషించనున్నట్లు, హీరో విలన్ రెండూ నాని అని తెలిసిపోయింది. గతంలో జెంటిల్ మ్యాన్ సినిమాలో రెండు పాత్రల్లో మెప్పించిన నాని మరోసారి ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న “కృష్ణార్జున యుద్ధం” సినిమాకి హిప్ హాఫ్ తమీజా (ధృవ సంగీత దర్శకుడు) మ్యూజిక్ అందించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















