నాని నిర్మాతగా మారుతోంది ఆ సినిమా కోసమేనా..?

ఎన్టీఆర్, ఏన్నార్ వంటి వారు హీరోలుగా నటిస్తూనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. తర్వాతి కాలంలో ఈ సంప్రదాయం కాస్త నిరాదరణకు గురైనా ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంది. కొందరు తమ సినిమాల నిర్మాణంలో మాత్రమే భాగమవుతుంటే మరికొందరు ఇతర హీరోలతోనూ సినిమాలు చేస్తున్నారు. పవన్, మహేశ్ వంటివారు తొలి రకానికి చెందినవారైతే రెండోదానికి కళ్యాణ్ రామ్ ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘ఖైదీ నెం 150’తో రామ్ చరణ్ కూడా హీరో కామ్ ప్రొడ్యూసర్ లిస్ట్ లో చోటు సంపాదించుకోగా నేచురల్ స్టార్ నాని కూడా నిర్మాతగా మారనున్నాడన్న వార్త టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతోంది.నిజానికి వరుస విజయాలతో జోరు మీదున్న నానితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. అయితే నాని మాత్రం వారిని పక్కన పెట్టి తానే నిర్మాణ భాద్యతలు మోసేందుకు సిద్ధమవుతున్నాడట.

అది అవసరాల శ్రీనివాస్ తో చేయబోయే సినిమా కోసమేనని గుసగుసలు.అవసరాల – నాని మధ్య గల స్నేహబంధం తెలిసిందే. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగాను ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు.నాని ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకోగా శ్రీని కూడా రెండు సినిమాలతో తన దర్శకత్వ ప్రతిభని చాటాడు. అలాంటిది వీరిద్దరి కలయికలో రాబోయే చిత్రం ఇద్దరికీ చాలెంజింగ్ గా ఉండాలని అనుకున్నారట. ఈ కాంబినేషన్ పై అటు పరిశ్రమ వర్గాలతోపాటు ప్రేక్షకుల్లోను మంచి అంచనాలున్నాయి. అయితే ప్రయోగాల బాటలో నడిచేటప్పుడు వేరే నిర్మాతలతో సావాసం కష్టమని తలచి బంధువులతో కలిసి సొంత కుంపటి పెట్టె ఉద్దేశ్యంలో ఉన్నాడట నాని. ఇదే జరిగితే పూర్తిస్థాయి నిర్మాతగా నానికి ఇదే తొలిచిత్రమవుతుంది. గతంలో ‘డీ ఫర్ దోపిడీ’ సినిమా నిర్మాణంలో నాని పాలుపంచుకున్న సంగతి తెలిసిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus