ఆ విషయంలో బెల్లంకొండ, నాని సేమ్ అంటున్నారు.. మేటర్ ఏంటి?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి (Bellamkonda Sai Sreenivas) హీరోగా మినిమమ్ మార్కెట్ ఉండేది. కానీ ‘నా కొడుకు ఇండియాలోనే పెద్ద స్టార్’ అంటూ బెల్లంకొండ అండ్ అతని టీం అతన్ని ఓవర్ గా ఎలివేట్ చేయడం వల్ల… అతనిపై నెగిటివిటీ ఏర్పడింది. ‘రాక్షసుడు’ (Rakshasudu) తో ఫామ్లోకి వచ్చాడు అనుకున్న బెల్లంకొండ తర్వాత ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs) తీశాడు అది ఫ్లాప్ అయ్యింది. హిందీ డెబ్యూగా ‘ఛత్రపతి’ ని రీమేక్ చేశాడు. అది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది.

Nani , Bellamkonda:

ఆ తర్వాత మాత్రం అతను వరుస సినిమాలు ఓకే చేశాడు. అలా అని దీనిని కంప్లీట్ చేయడం లేదు. ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) ఈపాటికే థియేటర్లలోకి రావాలి. కానీ దాన్ని కంప్లీట్ చేయకుండా ‘భైరవం’ (Bhairavam) ని కంప్లీట్ చేశాడు. ఇది రిలీజ్ కాకుండానే ‘హైందవం’ అనే సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. అది కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా.. ఇంకా సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాని కూడా బెల్లంకొండలానే ప్రవర్తిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది.

విషయంలోకి వెళితే.. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)  తర్వాత నాని (Nani) సిబి చక్రవర్తి (Cibi Chakaravarthi)  దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. కానీ పలు కారణాలు చెప్పి.. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. వెంటనే శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సినిమా చేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ‘హిట్ 3’ (HIT3) మొదలుపెట్టాడు నాని. ఇది ఇలా కంప్లీట్ అయ్యిందో లేదో.. ‘ది పారడైజ్’ (The Paradise)  గ్లింప్స్ రెడీ చేయించి రిలీజ్ చేయించాడు. ‘హిట్ 3’ ప్యాచ్ వర్క్ కూడా నాని కంప్లీట్ చేయాల్సి ఉందట.

మరోపక్క ‘ది పారడైజ్’ షూటింగ్ కూడా ఇప్పట్లో మొదలు పెట్టే ఆలోచనలో ఇతను లేడనేది ఇన్సైడ్ టాక్. ఈ ప్రాజెక్టులు ఇలా హోల్డ్ లో ఉండగానే ఇప్పుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సైన్ చేశాడట. వచ్చే ఏడాది వరకు ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. అయినా సరే ఈ గ్యాప్లో మరో కొత్త దర్శకుడి కథకి ఓకే చెప్పాడట నాని. అందుకే బెల్లంకొండతో పోలుస్తూ నానిని ఇండస్ట్రీలో కొంతమంది విమర్శిస్తున్నట్టు టాక్.

‘వీరమల్లు’ మాత్రమే కాదు ‘ఘాటి’ కి కూడా అవే ఇబ్బందులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus