Krish: ‘వీరమల్లు’ మాత్రమే కాదు ‘ఘాటి’ కి కూడా అవే ఇబ్బందులు..!

క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) పరిచయం అవసరం లేని పేరు. ‘గమ్యం’ (Gamyam) ‘వేదం’ (Vedam) ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (Krishnam Vande Jagadgurum) ‘కంచె’ (Kanche) వంటి మంచి సినిమాలు తీశారు. వాటి బాక్సాఫీస్ ఫలితాల సంగతి ఎలా ఉన్నా.. క్రిష్ పై గౌరవం పెరగడానికి అవి కారణమయ్యాయి. ఆ తర్వాత బాలకృష్ణ 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ (Gautamiputra Satakarni) అనే చారిత్రాత్మక సినిమా తీశారు క్రిష్. ఈ సినిమాలో విజువల్స్ వంటివి చూస్తే.. ఇది 2 ఏళ్ళ పాటు తీసిన సినిమానేమో అని అంతా అనుకుంటారు. కానీ కరెక్ట్ గా 80 రోజుల్లో ఈ సినిమాని కంప్లీట్ చేసి.. కొత్త చరిత్ర సృష్టించారు క్రిష్.

Krish

ఇలాంటి సినిమాలని అనుకున్న బడ్జెట్లో తీసి.. అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం అనేది కూడా గొప్ప ఛాలెంజ్. దానిని క్రిష్ సమర్థవంతంగా నిర్వర్తించారు. ఈ సినిమా కమర్షియల్ గా సేఫ్ అవ్వడానికి అదే కారణమని చెప్పడంలో సందేహం లేదు. దీనికి ముందు ‘కంచె’ సినిమాని కూడా తక్కువ బడ్జెట్లోనే తీసి రిలీజ్ చేశారు క్రిష్. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ తో (NTR: Kathanayakudu) డిజాస్టర్లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ముందుకొచ్చి ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా ఇది ప్రారంభం అయ్యింది.

కానీ పవన్ కళ్యాణ్.. ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టడంతో క్రిష్.. మధ్యలో ‘కొండపొలం’ (Konda Polam) అనే సినిమా చేశారు. తర్వాత కూడా పవన్ దీనికి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో.. క్రిష్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. తర్వాత ఏ.ఎం.రత్నం (A. M. Rathnam) కొడుకు రత్నం కృష్ణ (Jyothi Krishna)  దీని దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మే 9న ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అది ఎంత వరకు జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ 60 శాతం డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి..

ఇది బాగా ఆడితే క్రిష్ కి కూడా కొంత ప్లస్ అవుతుంది. మరోపక్క ఏప్రిల్ 17న క్రిష్ దర్శకత్వంలో అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటి’ (Ghaati) కూడా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉండటం వల్ల.. ఇది కూడా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. సో క్రిష్ దర్శకత్వంలో రూపొందిన 2 సినిమాల పరిస్థితి ఇలా ఉంది. వీటిలో ఒక్కటైనా హిట్ అయితేనే ఆయనకు పూర్వవైభవం వస్తుంది. లేదు అంటే హీరోలు ఛాన్సులు ఇవ్వడం కష్టం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus