అభిమానుల వల్ల ఇబ్బందులు పడుతున్న నాని !
- June 30, 2017 / 10:57 AM ISTByFilmy Focus
ఏదో అంటారు కదా….ఎక్కువైనా తట్టుకొలేము….తక్కువైనా తట్టుకొలేము….ఏదైనా సమపాళ్ళలో ఉండాలి అని…అలా అభిమానం కూడా అంతే శ్రుతిమించితే చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి…అసలు మ్యాటర్ ఏంటి అంటే…టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒరిజినల్ గా ఎదిగిన అతి కొద్ది మంది తారల్లో మన నాని ఒకరు. అయితే తన న్యాచురల్ నటనతో లక్షలాది మంది అభిమానాన్ని పొందిన నాని సామాన్యం గా వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు తన సినిమాల విషయం పై లేటెస్ట్ విషయాలను షేర్ చేయడం నాని అలవాటు. అయితే ఇప్పుడు అదే నానికి పెద్ద తలపోటు అయ్యీ కూర్చుంది…ఇప్పుడు అదే నానిపై అభిమానుల అసహనానికి కారణం అయ్యింది….అసలు విషయం లోకి వెళితే…సోషియల్ మీడియాలో నాని పై అతడి అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్త పరచడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దానికి కారణం ఏంటి అని వివరాల్ళోకి వెళితే…అసలు ఏం జరిగింది అంటే….నానీ వీరాభిమానులలో ఒకరు నానీ లేటెస్ట్ మూవీ ‘నిన్నుకోరి’ మూవీకి సరైన పబ్లిసిటీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తూ ఆ సినిమా నిర్మాతలో ఒకరైన కోన వెంకట్ కు ఒక ట్విట్ పెట్టడంతో ఆ ట్విటర్ పెట్టిన వ్యక్తి ఖాతాను కోన వెంకట్ బ్లాక్ చేయడంతో ఆ అభిమాని తీవ్ర అసహనానికి గురి అయ్యాడు. ఈ ట్విట్ ఆ అభిమాని నానీకి కూడ పంపడంతో నానీ ఆ అభిమానికి ఆ ట్విట్ విషయమై పెద్ద క్లాస్ పీకాడు…. అయితే ఈ క్లాస్ విషయం బయటకు రావడంతో నాని అభిమానులు అనేకమంది ఆ వీరాభిమానికి సపోర్ట్ గా నిలుస్తూ నానీకి రివర్స్ క్లాస్ పీకారు. ఒక సాధారణ అభిమాని వాడే భాష అలాగే ఉంటుందని దానిని అర్ధం చేసుకోకపోతే ఎలా అంటూ నానీ పై నాని అభిమానులు తీవ్ర అసహనాన్ని సోషల్ మీడియాలో వ్యక్త పరుస్తున్నారు. ఇక ఈ దెబ్బతో కాస్త ఇబ్బందుల్లో పడ్డ నాని…ఫ్యాన్స్ ని ఎలా బుజ్జగించాలో అర్ధం కాక…తల పట్టుకుంటున్నాడు…మొత్తంగా అంత తతంగం జరిగింది అన్న మాట.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















