నాచురల్ స్టార్ నాని దసరా సినిమా తర్వాత తిరిగి హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి నాని హాయ్ నాన్న సినిమాపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి పాటలు పోస్టర్స్ భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 7న విడుదల కానున్న నేపథ్యంలో నాని సరదాగా అభిమానులతో కలిసి చిట్ చాట్ చేస్తూ తన సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు.
ఇందులో భాగంగా అభిమానులు నానిని ఒక విషయంలో భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తోంది. మీరు తిరిగి ఆ హీరోయిన్ తో నటించాలని కోరుకుంటున్నాము అంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. మరి ఏ హీరోయిన్ తో నాని తిరిగి నటించాలనే విషయానికి వస్తే.. నాని కీర్తి సురేష్ కాంబినేషన్లో వచ్చినటువంటి నేను లోకల్ దసరా సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే నాని అభిమానులు మీరు మరోసారి కీర్తి సురేష్ తో కలిసి సినిమా చేయొచ్చు కదా మీ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ ఈయనని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాని చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.
ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నేను కీర్తి సురేష్ తో చేయడానికి సిద్ధంగా ఉన్నాను మరి నువ్వేమంటావ్ కీర్తి అంటూ ఆమెను టాగ్ చేశారు అయితే ఇప్పటివరకు కీర్తి సురేష్ నుంచి ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. ఇలా కీర్తి సురేష్ నాని కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తాజాగా స్పష్టం అవుతుంది.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!