Nani: నాని మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? జాన్వీ ఉందా? లేదా?

  • August 26, 2024 / 09:56 PM IST

జాన్వీ కపూర్‌  (Janhvi Kapoor)  తొలి రెండు సినిమాల సంగతి తేలిపోవడంతో మూడో సినిమా ఏంటి అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అగ్ర హీరోల సరసన ఆమె నటిస్తే, స్టెప్పులేస్తే చూడాలని ఆయా హీరోల అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నానితో ఓ సినిమా చేస్తుంది అని ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయంలో నాని  (Nani)  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌ పెంచాడు.

Nani:

‘సరిపోదా శనివారం’  (Saripodhaa Sanivaaram)  అంటూ ఈ నెల 29న నాని థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. వివేక్‌ ఆత్రేయ (Vivek Athreya)  కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న నాని.. తన తర్వాతి సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు జాన్వీ కపూర్‌ పేరు ప్రస్తావనకు వచ్చింది. ‘ఏమో నాకు ఆ సినిమా గురించి రీసెంట్‌గా నాకు సమాచారం లేదు’’ అని నాని క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ డౌట్స్‌ పెంచాడు.

నా తర్వాతి సినిమాలో జాన్వీ ఉందనేది రూమర్‌ మాత్రమే. సినిమాలోకి తీసుకోవడం కోసం ఆమెతో చర్చలు జరుగుతున్నాయేమో అని నాని చెప్పాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌ గురించి వివరాలు తెలుసుకోలేకపోయాను అని సమాధానమిచ్చాడు నాని. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాం అని చెప్పారు.

నాని – శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)  కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. చెరుకూరి సుధాకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలోనే జాన్వి కపూర్ను హీరోయిన్గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా రూ.100 కోట్ల విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మరిప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు జాన్వీ కూడా తోడైతే ఇంకెంతటి విజయం అందుకుంటుందో చూడాలి.

బ్యాండేజ్లతో మంచు లక్ష్మీ.. షాకిస్తున్న ఫోటో.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus