జ్యో అచ్యుతానంద్ లతో నాని!

నాని, అవసరాల శ్రీనివాస్ ప్రాణ స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఒకే సినిమాతో కెరీర్ ఆరంభించిన వీరిద్దరూ తమదైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీని రెండో చిత్రంగా ‘జ్యో అచ్యుతానంద’ని తెరకెక్కించారు. నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రధారులు. వారాహి చలన చిత్రం పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది.

ఈ సందర్బంగా పత్రికల వారితో ముచ్చటించిన దర్శకుడు శ్రీనివాస్ అవసరాల “నాని ఈ సినిమాలో అతిథి పాత్రలో కనపడతాడ”న్న ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఆ పాత్రేమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని చెప్పిన శ్రీని తానూ ఈ సినిమాలో ఓ పాత్ర పోషించినట్టు తెలిపారు. తొలుత ఈ కథ పలువురు హీరోలకు చెప్పినా ‘సినిమాలో ఇద్దరు హీరోలని’ పక్కకు తప్పుకున్నారట. ఫైనల్ గా రోహిత్ ఎంట్రీ ఇవ్వడంతో సినిమా పట్టాలెక్కిందని చెప్పుకొచ్చాడు శ్రీని. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘హంటర్’ రీమేక్ లో నటిస్తోన్న శ్రీని ఈ చిత్రం తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందన్నాడు. ఇది పూర్తవగానే నాని హీరోగా శ్రీని తెరకెక్కించనున్న మూడో చిత్రం మొదలవనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus