టాలీవుడ్ లో బడా హీరోల పేరుతో బడా హీరోల బ్యాక్ గ్రౌండ్ తో డప్పులు కొట్టుకుంటూ సేల్ అయిపోతున్న హీరోలు చాలా మందే ఉన్నారు…అయితే కస్టపడి పదికి వచ్చిన హీరోలు అతి తక్కువ మంది ఉండగా…అందులో నాని ఒకడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు…చిన్న చిన్న పనుల నుంచి….అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేసి…చివరకు హీరోగా మారి వరుస గా డబల్ హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా….సినిమాలను హిట్ చేసి తన టాలెంట్ ను మరోసారి రుజువు చేసుకున్నాడు నాని…ఇదిలా ఉంటే ఒకప్పడు నాని కాస్త వెనుక బడ్డాడు…సముద్రఖని డైరక్షన్ లో వచ్చిన జెండాపై కపిరాజు, కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన పైసా ఈ రెండు నాని కెరియర్ లో చాలా టైంను తినేశాయి. మంచి సినిమాలు అనుకున్న అవి రెండు నానిని ఎంతగానో వెనక్కి నెట్టేశాయి. ఇక కొద్ది పాటి గ్యాప్ తో ఎవడే సుబ్రమణ్యం సినిమా తీసి హిట్ అందుకున్నాడు నాని. ఇక ఆ సినిమా కథలోనే కాదు నాని ఆలోచనల్లో కూడా మార్పు తెచ్చుకునేలా చేసింది.
అందుకే నాని వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఎవడే సుబ్రమణ్యం తర్వాత భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీ ప్రేమ గాథ, జెంటిల్మన్, మజ్ఞు, నేను లోకల్ ఇక రీసెంట్ గా వచ్చిన నిన్నుకోరి. ప్రతి సినిమాలో నాని కథ చాలా కొత్తగా కాకున్నా సరే ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేలా చూసుకున్నాడు. అయితే చిన్న హీరో అయిన నాని సక్సెస్ కి అసలు కారణం ఏంటి అంటే…సరైన కథను ఎంచుకోవడం…దానికి తగ్గ నాచురల్ నటనను ప్రదర్శించడం…ఇదే నాని హిట్ కు అసలు సూత్రం…ఆయన సక్సెస్ మంత్రం…అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటి అంటే…కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో నాని ముందున్నాడు అని చెప్పక తప్పని విషయం. ఏది ఏమైనా…నాని సక్సెస్ ఇలానే కొనసాగాలి అని…సరికొత్త ట్యాలెంటెడ్ దర్శకులకు నాని లైఫ్ ఇవ్వాలి అని అందరం కోరుకుందాం…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.