Nani: నాని లెక్కలు మారుస్తారా.. దసరాను మించిన హిట్ సాధిస్తారా?

న్యాచురల్ స్టార్ నాని  (Nani)  బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. దసరా (Dasara) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో నాని బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు కమర్షియల్ గా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించాయి. మరికొన్ని రోజుల్లో నాని సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Nani

ఆగస్టు నెలలో విడుదలైన సినిమాల్లో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు అయితే చేయడం లేదనే సంగతి తెలిసిందే. నాని సరిపోదా శనివారం సినిమాతో థియేటర్లు కళకళలాడాలని అభిమానులు భావిస్తున్నారు. వివేక్ ఆత్రేయ  (Vivek Athreya) డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య  (D. V. V. Danayya)  ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

మిడిల్ రేంజ్ హీరోలలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న నాని టైర్ వన్ హీరోల జాబితాలో చేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. నాని ఎస్ జె సూర్య (SJ Suryah)  కాంబో సన్నివేశాలు అద్భుతంగా ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు నెలలో బిగ్గెస్ట్ హిట్ గా సరిపోదా శనివారం నిలిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే దర్శకుడిగా వివేక్ ఆత్రేయ రేంజ్ పెరుగుతుందేమో చూడాల్సి ఉంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరాలని ఇండస్ట్రీ వర్గాల ప్రముఖులు సైతం కోరుకుంటున్నారు. గతంలో నాని వివేక్ ఆత్రేయ కాంబోలో అంటే సుందరానికి సినిమా తెరకెక్కగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు. నాని లెక్కలు మార్చేసి దసరాను మించిన హిట్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

‘డబుల్ ఇస్మార్ట్’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus