నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి గారు, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి గారు, నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి గారు, ఆర్ ఎల్ టీ గ్రూప్ చైర్మన్ అమీర్ బాబు, ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఏ కే జెడ్ జువెల్లర్స్ చైర్మన్ అఫ్జల్ ఖాన్, చిన్నప్ప రెడ్డి, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవర్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ.. ‘విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ.. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నాను. విద్యా రంగంలో అంచెలంచెలుగా ఎలాగైతే ఎదిగారో.. నాని గారు సినిమా రంగంలోనూ అలానే ఎదగాలి. నూతన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ లాంచ్‌కు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. చలన చిత్ర పరిశ్రమ కడప వైపు, రాయలసీమ వైపు చూసేలా కచ్చితంగా చేస్తామ’ని అన్నారు.
నాని మాట్లాడుతూ.. ‘డబ్బులు సంపాదించడానికి ఈ సినిమాను నిర్మించలేదు. డబ్బుల గురించి నేను ఆలోచించలేదు. కడప జిల్లాకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాను. అందుకే ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇక్కడకు రావడానికి మా అమ్మకు ఇష్టం లేదు. సక్సెస్ కొట్టి మా అమ్మకి చూపించాలని అనుకున్నాను. ఆడిషన్స్‌ను ఉపయోగించుకుని సినిమాలో నటించబోతోన్న వారందరికీ మంచి భవిష్యత్తు ఉండబోతోంది. స్టూడెంట్స్ కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే మళ్లీ ఆడిషన్స్ పెడతాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండ’ని అన్నారు.
రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కానున్నాయి. ఆ తరువాత కడప జిల్లాలోనే షూటింగ్ చేస్తాం. అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
విశ్వ కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నా కెరీర్‌లో ఎంతో ముఖ్యమైంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఇది చాలా కొత్త స్క్రిప్ట్. ఇప్పుడే కథ గురించి పూర్తిగా చెప్పలేను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.
ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘ఇలా కడపలో మా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చిన అతిథులకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ ప్యాషన్ తెలుసుకుని, వారి కోసం నాని గారు ఇలా సినిమాను తీయడం చాలా గ్రేట్. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. విశ్వ కార్తికేయతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
కాటం రమేష్ మాట్లాడుతూ.. ‘కలియుగం పట్టణంలో పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఈవెంట్‌ను ఇంత గ్రాండ్‌గా నిర్వహించినందుకు ఓబుల్ రెడ్డి (నాని) గారికి థాంక్స్’ అని అన్నారు.
రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి గారు, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి గారు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి గారు, నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి గారు, ఆర్ ఎల్ టీ గ్రూప్ చైర్మన్ అమీర్ బాబు, ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి, ఏ కే జెడ్ జువెల్లర్స్ చైర్మన్ అఫ్జల్ ఖాన్, చిన్నప్ప రెడ్డి, టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గోవర్దన్ రెడ్డి ఇలా అందరూ మాట్లాడుతూ.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.