Nani: లిప్ లాక్ సీన్స్ భార్య రియాక్షన్ పై నాని కామెంట్స్ వైరల్..!

సాధారణంగా మూడు ముళ్లు వేసిన తర్వాత ఏ మహిళ అయినా తన భర్త తనకే సొంతం అనుకుంటూ ఉంటుంది. పరాయి స్త్రీ పేరు తలిచినా తట్టుకోలేదు. అదే వేరే మహిళతో తన భర్తకు సంబంధం ఉందని తెలిస్తే.. ఒకటి అతడైనా చంపేస్తుంది.. లేదా తనైనా చస్తుంది. అంతలా భర్తను ప్రేమిస్తుంటుంది. ఇది సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. సినిమా వాళ్ల భార్యలు మాత్రం ఇలాంటి దానికి అతీతులేం కాదు.

సినిమాల్లో భాగంగానైనా తన భర్త వేరే హీరోయిన్లతో చనువుగా ఉంటే తట్టుకోలేరు. తోటి హీరోయిన్ తో లిప్ లాక్ చేసినా.. బెడ్ సీన్స్ చేసినా ఇంటికి వెళ్లాక కాస్త పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది సదరు హీరోగారికి. ఇప్పుడు నాని తన పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని తాజా చిత్రం హాయ్ నాన్న.

ఈ సినిమాలో సీతారామం ఫేమ్.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇటీవల రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో నాని మృణాల్ లెక్కకు మించిన లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి.సినిమాకు ఇవి హైలెట్ గా నిలవనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ముద్దు సీన్లపై నాని (Nani) వివరణ ఇస్తూ.. కథ డిమాండ్ ను బట్టే రొమాంటిక్ ఉంటాయని చెప్పుకొచ్చారు.

అలాంటి సీన్లు చేసి ఇంటి వెళ్లిన తర్వాత తన భార్య దగ్గర తనకు దబిడి దిబిడి తప్పవని నాని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి . నాని లిప్ లాక్ సీన్స్ నటించి.. ఇంటికెళ్లాక అంజనా దబిడి దిబిడి చేస్తుందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus