చిన్న హీరో….చాలా వదిలేసాడు!!!

యంగ్ హీరో, న్యాచురల్ స్టార్ నాని కరియర్ ఒకసారి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ఎన్నో ఏళ్లకు గాని నానికి సరైన బ్రేక్ దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసీ…చేసీ చివరకు ‘అష్టా చమ్మా’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత రాజమౌళి తీసిన ఈగ సినిమాలో ముఖ్యమైన పాత్ర చేసి అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, టాప్ హీరోగా ఎదిగాడు. ఇదిలా ఉంటే సరిగ్గా రెండు ఏళ్ల క్రితం ఇదే సమయాన్ని తీసుకుంటే నాని కరియర్ చాలా ఇబ్బందికర పరిస్తితుల్లో ఉంది. కృష్ణ వంశీ తీసిన పైసా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత సందడి చెయ్యలేదు. ఇక ఆహా కళ్యాణం సైతం బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ అని అంది. ఇక చేసేది ఏమీ లేక, ఏం చెయ్యాలో అర్ధం కానీ నాని, చాలా తెలివిగా తన కరియర్ ను ప్లాన్ చేసుకున్నాడు.

దాదాపు పది నెలలు గ్యాప్ తీసుకుని మరీ మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆ రెండు సినిమాల తరువాత దాదాపుగా 80కధలు విన్న నాని, చివరకు డిఫరెంట్ లవ్ స్టోరీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టాడు. ఇక అప్పటినుంచి ఆచి తూచి ఆలోచిస్తూ కధ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఒప్పుకోకుండ సినిమాలు చేస్తున్నాడు. అంతెందుకు సినిమాలు ఫ్లాప్స్ అవుతున్న కాలంలోనే కాదు, హిట్ సమయాల్లో కూడా నాని కధ పట్ల చాలా పక్కాగా ఉంటున్నాడు.

‘భలే భలే మగాడివోయ్’ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో నానితో సినిమా సినిమా చేయడానికి పేరున్న దర్శకులు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఐతే ఎంత పేరున్న వారైనా సరే.. కథ నచ్చకపోతే సినిమా చేసే ఛాన్సే లేదంటున్నాడు నాని. ఈ మధ్య కాలంలో అతను 16 సినిమాల్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. మొహమాటానికి పోయి సినిమాలు ఒప్పుకుంటే తన కెరీర్ మళ్లీ ప్రమాదంలో పడుతుందని నాని ఇంత జాగ్రత్త పడుతున్నాడట. ఇక ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ రొమాంటిక్ థ్రిల్లర్లో నటిస్తున్నాడు. ఏది ఏమైనా నాని పట్టుదలను మెక్చుకుని తీరాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus