Hero Nani: హిట్3 విషయంలో నాని ప్లాన్ ఇదేనా?

హీరో నాని సినిమాలలో హీరోగా వరుస సక్సెస్ లను అందుకుంటూనే అద్భుతమైన కథ, కథనం ఉన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా అభిరుచిని చాటుకుంటున్నారు. హిట్1, హిట్2 సినిమాల విజయాలతో హిట్3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. హిట్3 లో హీరోగా నటిస్తున్నట్టు నాని ప్రకటించడంతో ఈ సినిమా మరింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కనుందని స్పష్టత వచ్చింది. హిట్3 మూవీ బడ్జెట్ విషయంలో అస్సలు రాజీ పడకూడదని నాని భావిస్తున్నారని సమాచారం.

హిట్3 సినిమాలో విశ్వక్ సేన్, అడివి శేష్ కూడా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ మల్టీస్టారర్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం గురించి నాని ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. హిట్3 మూవీలో అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నారు. విశ్వక్ సేన్, అడివి శేష్ తో కలిసి దిగిన ఫోటోను నాని షేర్ చేయడంతో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాని దసరా సినిమాతో మార్కెట్ ను భారీగా పెంచుకోవడం గ్యారంటీ అని దసరా మూవీ తర్వాత హిట్2 మూవీ విడుదలైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హిట్3 మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ కానుంది. దర్శకుడు శైలేష్ కొలను ప్రస్తుతం

ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో నాని కొత్త లుక్ లో కనిపించనున్నారు. విభిన్నమైన కథలకు ఓటేస్తున్న నాని మెజారిటీ సందర్భాల్లో సక్సెస్ ను సొంతం చేసుకుంటున్నారు. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus