ఆ తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తానంటున్న నాని

తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన ’96’ త్వరలో విడుదలకు సిద్ధమవుతుండగా.. ఈ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ను ఇటీవల దిల్ రాజు చూశారట. తొలుత డబ్బింగ్ చేద్దాం అనుకొన్నప్పటికీ.. డబ్బింగ్ కంటే రీమేక్ చేస్తేనే బెటర్ అని భావించి ఈ చిత్రాన్ని నానికి చూపించగా.. కంటెంట్ నచ్చడంతోపాటు కొత్తగా కూడా ఉండడంతో తన కెరీర్ కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని భావించిన నాని వెంటనే ఒప్పుకొన్నాడని తెలుస్తోంది.

అయితే.. మన నేచురల్ స్టార్ నాని బాబుకి రీమేక్ లు పెద్దగా అచ్చిరాలేదు. “భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం” సినిమాలో నటించాడు. ఆ రెండు సినిమాలూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత రీమేక్ ల జోలికి వెళ్లలేదు నాని. ఇప్పుడు మళ్లీ అలాంటి రిస్క్ చేయబోతున్నాడా..? అని ఫిలిమ్ నగర్ టాక్. మరి రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus