కరోనాకి ఏమాత్రం భయపడని నాని.. వెంటనే మరో సినిమా స్టార్ట్..!

నేచురల్ స్టార్ నాని వేగంగా సినిమాలు చేస్తుంటాడు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కు భయపడి షూటింగ్ లకు హీరోలు లేట్ గా హాజరవుతూ వస్తున్న సందర్భాలను చూస్తూనే వస్తున్నాం.దర్శక నిర్మాతలు కూడా నిదానమే ప్రధానం అన్నట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే మన నాని మాత్రం కరోనాని ఏమాత్రం లెక్కచెయ్యకుండా వరుసగా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. మొన్నటికి మొన్న ‘టక్ జగదీష్’ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసిన నాని..

ఆ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశాడు. ఇప్పుడు నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందనున్న ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ ను కూడా వేగవంతం చేసాడు. ‘ట్యాక్సీ వాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. జనవరి 13 వరకూ ఇక్కడే నాన్ స్టాప్ గా ఓ షెడ్యూల్ ను జరిపి ఆ తరువాత చిన్న బ్రేక్ ఇస్తారట.

ఇక ఫిబ్రవరి నుండీ నాన్ స్టాప్ గా మరో షెడ్యూల్ నిర్వహిస్తారట.ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి, ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక నాని ‘టక్ జగదీష్’ చిత్రం సమ్మర్ కి విడుదల కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. అంతేకాదు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ‘అంటే సుందరానికి’ అనే చిత్రంలో కూడా నాని హీరోగా నటిస్తున్నాడు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus