Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

నాచురల్ స్టార్ నాని, సితార ఎంటర్టైన్మెంట్స్ కలయిక అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది జెర్సీ సినిమా. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. గెలుపు కంటే ప్రయత్నం గొప్పదనే పాయింట్ తో ఆడియన్స్ ను కదిలించారు. ఆ తర్వాత ఈ బ్యానర్ లో నాని సినిమా చేయలేదు. అయితే ఇన్నాళ్లకు నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. 2026 సెకండ్ హాఫ్ లో నానితో ఖచ్చితంగా సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. కానీ డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

Nani

ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తున్న ఆసక్తికరమైన చర్చ ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కోసం మళ్ళీ గౌతమ్ తిన్ననూరినే రంగంలోకి దింపుతారా అని. జెర్సీ మ్యాజిక్ రిపీట్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని కొందరి వాదన. అయితే మరోవైపు హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. నానికి శౌర్యువ్ టేకింగ్ మీద మంచి నమ్మకం ఉంది కాబట్టి, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు.

ఇక ఈ రేసులో ఉన్న మరో బలమైన పేరు వెంకీ అట్లూరి. సితార బ్యానర్ కు ఈయన ఆస్థాన దర్శకుడిగా మారిపోయారు. సార్, లక్కీ భాస్కర్ లాంటి వరుస విజయాలతో నాగవంశీకి వెంకీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్న వెంకీ, ఆ తర్వాత నానితో వర్క్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెంకీ కమర్షియల్ పల్స్ నానికి బాగా సెట్ అవుతుందని టాక్.

ప్రస్తుతం నాని చేతిలో శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ‘ది ప్యారడైజ్’, సుజిత్ సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తయ్యాకే సితార సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. నాగచైతన్యతో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. మొత్తానికి 2026లో సితార నుంచి నాని సినిమా రావడం పక్కా కానీ, ఆ మెగాఫోన్ పట్టుకునేది ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జెర్సీ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా లేదా కొత్త డైరెక్టర్ వస్తారా చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags