THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

నాచురల్ స్టార్ నాని రూట్ మార్చాడు. ఇన్నాళ్లు పక్కింటి కుర్రాడిలా మనకు దగ్గరైన నాని, ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా ప్లాన్ చేస్తున్నాడు. కేవలం పాన్ ఇండియా స్టార్‌గా మిగిలిపోకుండా, గ్లోబల్ మార్కెట్‌పై కన్నేశాడు. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాను కేవలం మన వాళ్లకే కాదు, వెస్ట్రన్ ఆడియన్స్‌కి కూడా చూపించి వావ్ అనిపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

THE PARADISE

దీనికోసం నాని వేస్తున్న స్కెచ్ మామూలుగా లేదు. ఏదో డబ్బింగ్ రైట్స్ అమ్మేసి చేతులు దులుపుకోవడం కాకుండా, ఏకంగా సినిమాను అక్కడి జనాల్లోకి చొచ్చుకుపోయేలా చేయాలనేది ప్లాన్. ఇందుకోసం ఇంటర్నేషనల్ మీడియాను, సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోయింగ్ ఉన్న ఫారిన్ ఇన్ఫ్లుయెన్సర్లను రంగంలోకి దింపుతున్నారట. మన కంటెంట్‌ను వాళ్ల ద్వారా వెస్ట్ మార్కెట్‌లో ప్రమోట్ చేయాలనేది ఈ క్రేజీ స్ట్రాటజీ వెనకున్న అసలు ఉద్దేశం.

ఇక అన్నింటికంటే షాకింగ్ విషయం ఒకటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ స్టార్ ‘రయాన్ రెనాల్డ్స్’ను సంప్రదిస్తున్నారనే వార్త ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ‘డెడ్‌పూల్’ లాంటి గ్లోబల్ స్టార్ మన తెలుగు సినిమా ప్రమోషన్‌లో భాగం అవ్వడమే ఒక సెన్సేషన్. ఈ డీల్ గనుక సెట్ అయితే, ‘ది ప్యారడైజ్’ బ్రాండ్ వాల్యూ మరో లెవెల్ కు వెళ్లే చాన్స్ ఉంది. నాని అండ్ టీమ్ ఆలోచనలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పడానికి ఇదొక్క ఉదాహరణ చాలు.

అయితే నాని ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి అసలు కారణం కంటెంటే. శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేస్తున్న రా అండ్ రస్టిక్ వరల్డ్, దానికి అనిరుధ్ ఇస్తున్న ఎలక్ట్రిఫయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవని ఇన్సైడ్ టాక్. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. సరుకులో దమ్ము ఉంది కాబట్టే, బడ్జెట్ విషయంలో గానీ, ప్రమోషన్స్ విషయంలో గానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు నిర్మాత సుధాకర్ చెరుకూరి. 2026 మార్చిలో రాబోతున్న ఈ సినిమా నాని కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ మూవీ. ఈ గ్లోబల్ ప్లాన్ గనుక వర్కవుట్ అయితే, టాలీవుడ్ మార్కెట్ పరిధి మరింత పెరుగుతుంది. మరి నాని నమ్మకం, శ్రీకాంత్ విజన్ కలిసి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus