NANI: నాని సైలెన్స్.. రూమర్లకు చెక్ పడేది అప్పుడేనా?

‘దసరా’ బాక్సాఫీస్ దగ్గర చేసిన రచ్చ మనకు తెలిసిందే. ఆ ఊపుతోనే నాని, శ్రీకాంత్ ఓదెల మరోసారి కలిశారు. ‘ది ప్యారడైజ్’ అంటూ భారీ బడ్జెట్‌తో దిగారు. కానీ ఇప్పుడు బయట వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌న్నీ అప్సెట్ చేస్తున్నాయి. షూటింగ్ ఆగిపోయిందని, సెట్స్ మీద గొడవలని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ నిశ్శబ్దం వెనుక అసలు కథ వేరే ఉందని, అది నాని టీమ్ ఆడుతున్న కొత్త స్ట్రాటజీ అని ఇండస్ట్రీలో టాక్.

NANI

వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. చేతిలో సమయం తక్కువగా ఉంది. పైగా పోటీలో రామ్ చరణ్ ‘పెద్ది’ లాంటి భారీ సినిమా ఉంది. ఇప్పటికే ఆ సినిమా పాటలతో సోషల్ మీడియాను ఊపేస్తుంటే, ‘ప్యారడైజ్’ నుంచి కనీసం చిన్న సౌండ్ కూడా లేకపోవడం సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. అయితే ఈ సైలెన్స్ చేతకానితనం కాదట, సరైన సమయంలో ఒకేసారి బ్లాస్ట్ చేయడానికి వేస్తున్న ప్లాన్ అని తెలుస్తోంది.

మేకర్స్ ఆలోచన ఏంటంటే.. చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చి హైప్ పెంచడం కాదు, ఒకేసారి ఇంటర్నేషనల్ లెవెల్ ఈవెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాలట. కేవలం లోకల్ మీడియానే కాకుండా, నేషనల్ మీడియాను కూడా రంగంలోకి దింపి, ఒక భారీ ఈవెంట్ ద్వారా టీజర్‌నో, సాంగ్‌నో వదలాలని స్కెచ్ వేస్తున్నారు. అప్పటివరకు బయట జరిగే ఈ నెగటివ్ ప్రచారాన్ని పట్టించుకోకూడదని డిసైడ్ అయ్యారట.

ఈ ప్లాన్ మొత్తం సక్సెస్ అవ్వాలంటే కీ రోల్ ప్లే చేయాల్సింది అనిరుధ్ రవిచందర్. బయట ‘చికిరి చికిరి’ సాంగ్ మోత మోగుతోంది. దాన్ని డామినేట్ చేసే రేంజ్ అవుట్‌పుట్ అనిరుధ్ ఇస్తేనే నాని ప్లాన్ వర్కవుట్ అవుతుంది. అందుకే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్వయంగా చెన్నై వెళ్లి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. అనిరుధ్ బిజీగా ఉన్నా, ఈ సినిమా కోసం స్పెషల్ ట్యూన్స్ రెడీ చేస్తున్నారట. నాని టీమ్ తీసుకున్న నిర్ణయం చాలా డేరింగ్‌గా ఉంది. సినిమా గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాలంటే మాటలు సరిపోవు, కంటెంట్ మాట్లాడాలి. ఆ గ్లోబల్ ఈవెంట్ జరిగే వరకు ఈ సస్పెన్స్ తప్పదు. ఒక్కసారి ఆ సాలిడ్ అప్డేట్ బయటకు వస్తే, ఈ సైలెన్స్ అంతా ఒక పెద్ద విస్ఫోటనం కోసమే అని అందరికీ అర్థమవుతుంది. అప్పటివరకు ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాల్సిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags