Hero Nani: హిట్ సీక్వెల్ లో నాని నటిస్తారా..?

  • August 27, 2022 / 11:27 AM IST

నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నాని రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తోన్న నాని.. మరోపక్క సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు.

నాని తన బ్యానర్ లో నిర్మించిన ‘హిట్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. విశ్వక్ కెరీర్ లో ఇదొక మంచి హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు నాని. సీక్వెల్ లో కూడా విశ్వక్ సేన్ నటిస్తాడని అనుకున్నారు. కానీ అడివి శేష్ ను ఆన్ బోర్డ్ చేశారు. ‘హిట్’ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన దర్శకుడు శైలేష్ కోనేరు.. హిందీలో రీమేక్ చేశారు. రీసెంట్ గా హిందీ వెర్షన్ రిలీజయింది.

కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. తెలుగులో సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ కాకుండానే ‘హిట్3’ కూడా ఉంటుందని అంటున్నారు. ఈసారి నిర్మాతగా ఉన్న నాని లీడ్ రోల్ పోషిస్తారని టాక్. దర్శకుడు శైలేష్ కోనేరు నాని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ‘హిట్3’ కథ రాయబోతున్నారట.

క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాతో నాని బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు నాని కూడా ‘హిట్3’తో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus