నానికి కథ సిద్ధం చేసిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తారనే విమర్శ ఉండేది. నువ్వే నువ్వే సినిమా తర్వాత గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుంది. అయితే అత్తారింటికి దారేది తర్వాత యువహీరో నితిన్ తో అ..ఆ సినిమాని చేసి తనపై ఉన్న అపవాదుని తరిమికొట్టారు. అలాగే మరోసారి యువహీరోతో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ సినిమాని చేస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా కష్టపడుతున్నారు. ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దసరాకి ఈ సినిమా థియేటర్లోకి రానుంది. దీని తర్వాత విక్టరీ వెంకటేష్ తో మూవీ చేయనున్నారు. ఈ సినిమాలో వెంకీకి సక్సస్ లేడీగా పేరు దక్కించుకున్న త్రిష హీరోయిన్ గా ఎంపికయింది.

ఈ మూవీ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని కూడా హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్నారు. దీని తర్వాత ప్రాజక్ట్ ని కూడా త్రివిక్రమ్ లైన్లో పెట్టారు. నేచురల్ స్టార్ నాని ని త్రివిక్రమ్ డైరక్ట్ చేయనున్నట్లు తెలిసింది. ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియలేదు. నిర్మాత మాత్రం రాధా కృష్ణ మాత్రం కాదని తెలిసింది. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని బ్యానర్లో కాదని ఈ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజక్ట్ వివరాలు పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus