వి మూవీ ట్రైలర్ రివ్యూ

నాని, సుధీర్ హీరోలుగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ వి. నాని 25వ చిత్రం కావడంతో భారీ బుడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. లాక్ డౌన్ కారణంగా చాల కాలంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు. దాదాపు 35కోట్ల వరకు చెల్లించి ప్రైమ్ ఈ చిత్రాన్ని దక్కించుకుంది. సెప్టెంబర్ 5 నుండి వి మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం హీరో నాని రంగంలోకి దిగడం జరిగింది.

ఆయన వినూత్నంగా వి మూవీని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వి మూవీ ట్రైలర్ ని నేడు విడుదల చేశారు. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన వి ట్రైలర్ థ్రిల్లింగ్ గా ఉంది. నాని మరియు సుధీర్ ల నాన్ స్టాప్ యాక్షన్ కలిగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. సైకో కిల్లర్ నాని, సిన్సియర్ పోలీస్ సుధీర్ మధ్య నడిచే వార్ డ్రామాగా వి మూవీ అనిపిస్తుంది. సైకో కిల్లర్ గా నాని ఆటిట్యూడ్, మేనరిజం టోటల్ డిఫరెంట్ గా ఉన్నాయి. నెగెటివ్ షేడ్ రోల్ లో నాని నటన చాలా సహజంగా ఉంది.

నటుడిగా నానిని మరో స్థాయికి చేర్చే చిత్రం అవుతుంది అనిపిస్తుంది. సుధీర్ తో పాటు, నివేదా థామస్ పాత్రలు కూడా సినిమాలో చాల కీలకంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రానికి బీజీఎమ్ థమన్, సాంగ్స్ అమిత్ త్రివేది అందిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus