రష్మికని బతిమాలుతున్న నాని… ఎందుకు?

కన్నడ బ్యూటీ రష్మిక అతి తక్కువ సమయంలోనే తెలుగువారికి అభిమాన హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు హీరోలకి కూడా ఆమె ఇష్టమైన నటిగా మారిపోయింది. గీత గోవిందం సినిమాలో ఆమె నటనకు, సహకారానికి ఫిదా అయిపోయిన విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాలో అవకాశమిచ్చారు. అంటే రష్మికని హీరోయిన్ గా తీసుకోమని సలహా ఇచ్చారు. వీరిద్దరూ కలిసి భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే సినిమాలో మరోసారి రొమాన్స్ చేయనున్నారు. నాని, నాగార్జున మల్టీస్టారర్ మూవీలో రష్మిక నాని సరసన నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ సమయంలో నానికి రష్మిక నటన, డెడికేషన్ బాగా నచ్చిందంట.

అందుకే తనతో కలిసి నటించాలని నాని ఆశపడుతున్నట్టు సమాచారం. ఈ మధ్య నానికి దర్శకుడు బోయపాటి శ్రీను ఒక కథను వినిపించారంటా. యాక్షన్, ప్రేమ రెండు కలకలిసిన ఈ కథలో హీరోయిన్ ఎవరిని పెడదామని దర్శకుడు బోయపాటి నానిని సలహా అడిగాడట. దీంతో నాని ఆలోచించకుండా రష్మిక పేరు చెప్పినట్లు సమాచారం. మూడు సినిమాల్లో బిజీగా ఉన్న రష్మిక మన సినిమాలో నటిస్తుందా? అని దర్శకుడు ప్రశ్నించగా ఆమెతో మాట్లాడి మన సినిమాలో నటించేందుకు ఒప్పిస్తానని నాని మాట ఇచ్చినట్లు టాక్. ఇప్పుడు అదేపనిలో ఉన్నారని తెలిసింది. మరి నాని అడిగితే రష్మిక ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus