కుర్రకారుకి కొత్త క్రష్ దొరికేసింది.. గ్యాంగ్ లీడర్ బ్యూటీకి అందరూ ఫిదా

కొంతమంది అమ్మాయిలను చూస్తే నోట నుండి మాట కూడా పెగలదు. కానీ.. కొంతమందిని చూస్తే కవితలు హృదయాన్ని తన్నుకోంటూ వచ్చేస్తుంటాయి. ఈ రెండో కోవలకి వచ్చి కూర్చున్న కొత్తమ్మాయి ప్రియాంక మోహన్. ఇదివరకే తమిళ, కన్నడ సినిమాలు చేసిన ప్రియాంక మోహన్ కి “గ్యాంగ్ లీడర్” చిత్రం తెలుగు డెబ్యూ. అయితే.. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్ లో ఆమెను ఒక సాధారణ పాత్రధారిలా చూపించిన “గ్యాంగ్ లీడర్” టీం తొలిసారిగా ఆమెను నిన్న విడుదల చేసిన “నిన్ను చూసే ఆనందంలో” అనే లవ్లీ సింగిల్ ను విడుదల చేసి.. ఆ పాటలో వచ్చే చిన్నపాటి సీన్ లో ప్రియాంకను నిండైన చీర కట్టులో చూపించి మతులు పోగొట్టేశారు.

“అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా, ఇట్స్ ఏ క్రైమ్” అని నాని చెప్పే డైలాగ్ ప్రియాంకకి పర్ఫెక్ట్ గా సరిపోయింది. అరంగుళం కూడా ఎక్స్ ఫోజ్ చేయకుండా.. ఒళ్ళంతా నిండుగా కప్పుకొని కూడా అందంగా కనిపించవచ్చని ప్రియాంక మరోమారు చూపించింది. ఈ అమ్మాయిని చూసిన వాళ్ళందరూ.. “ఏంటి మరీ ఇంత అందంగా ఉంది?” అని ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇక అమ్మడికి ఫ్యాన్ పేజీలు, క్రష్ బ్యాంక్ లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒకవేళ సినిమా విడుదలై.. మంచి విజయం సాధిస్తే మాత్రం ప్రియాంక మోహన్ హ్యాపీగా టాలీవుడ్ లో సెటిల్ అయిపోవచ్చు. పొగిడితే అతి అనుకొంటారు కానీ.. ఆ చీర కట్టులో అమ్మడు నిజంగానే సౌందర్యంత అందంగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus