నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ చిత్రానికి ముందు ఈ అమ్మడి గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. కానీ సినిమా ప్రోమోలు, పోస్టర్లు వచ్చాక… సూపర్ హీరోయిన్ దొరికింది మన టాలీవుడ్ కు అనే కామెంట్స్ వినిపించాయి. కచ్చితంగా ఈ అమ్మడికి తరువాత మంచి ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ విడుదలయ్యాయి ఇప్పుడు ఈ అమ్మడి గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు.
దీనికి ప్రధాన కారణం ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అనుకుంటే.. యావేరేజ్ ఫలితాన్నే అందుకోవడం. ఇక మరో కారణం ఈ చిత్రంలో ప్రియాంక పాత్ర మిగిలిన నలుగురు ఆడవాళ్ళలో ఒకరిగా చూపించడం. అంటే ఆమెను గ్లామర్ చూపించలేదు.. హీరోతో రొమాన్స్ కు పెద్ద స్కోప్ లేదు.. కనీసం డ్రీం సాంగ్ లు.. డ్యూయెట్ లు లేకపోవడం కారణాలు గా చెప్పుకోవచ్చు. దీంతో పాటు కనీసం ఈమె పెర్ఫార్మన్స్ కు కూడా పెద్ద స్కోప్ లేకపోవడం మరో కారణం అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ భామ ఇప్పుడు గ్లామర్ డోస్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఘాటు మార్గానికి నేను కూడా ‘సై’ అంటూ హాట్ హాట్ ఫోజులతో కూడిన ఫోటోలను పోస్ట్ చేసింది. మరి దర్శక నిర్మాతలు ఈమెకు అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి..!