పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా రూపొందిన పీరియాడిక్ అండ్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి కొన్ని కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఫైనల్ రన్ టైం 2 గంటల 42 నిమిషాలు వచ్చినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తారు కాబట్టి.. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని రన్ టైం క్రిస్పీ గా చేసినట్టు స్పష్టమవుతుంది. తర్వాత సెన్సార్ వారు కూడా కొన్ని సన్నివేశాలకి కత్తెర చెప్పినట్లు తెలుస్తుంది.
1) ‘ ‘హరిహర వీరమల్లు’ చారిత్రాత్మక సినిమా అయినప్పటికీ.. కొన్ని రిఫరెన్సులు తీసుకుని ఫిక్షన్ ను జోడించి తీసిన సినిమా అని.. కేవలం వినోదం కోసమే తప్ప ఎవరినీ నొప్పించే విధంగా సన్నివేశాలు పెట్టలేదని, ఎటువంటి జంతువులకు హాని చేయలేదని’ ఓ 20 సెకన్ల వాయిస్ ఓవర్ ను జోడించినట్టు తెలుస్తుంది.
2) సినిమాలో ఓ క్యారెక్టర్ పేరు ఖులీ ఖుతుబ్ షా అని పెట్టారట. ఓ సందర్భంలో ఆ పేరును ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు.. దానిని మ్యూట్ చేసినట్లు సమాచారం.
3) ఓ సందర్భంలో విగ్రహాలు తొలగించే/పడగొట్టే సన్నివేశాలను తొలగించినట్టు సమాచారం.
4)గర్భిణీ స్త్రీలపై దాడి చేసే సన్నివేశాల నిడివిని కూడా తగ్గించారట.
5) గుడి తలుపులను కొట్టడం/తన్నడం వంటి సన్నివేశాలను కూడా డిలీట్ చేశారట.
ఇలా మొత్తంగా.. 24 సెకన్ల నిడివి తొలగించినట్టు స్పష్టమవుతుంది.