మొదలైన జెంటిల్ మన్ డబ్బింగ్ కార్యక్రమాలు..!

మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జెంటిల్ మన్’. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందుతుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను శ్రీరామ నవమి సందర్భంగా ఇటీవలే విడుదల చేశారు. నాని విలనా లేక హీరోనా అంటూ ఆసక్తికరంగా ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన నివేదిత థామస్, సురభిలు జంటగా నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మే నెలాఖరులో కానీ, జూన్ మొదటి వారంలో కానీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus