‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం రోజులకి గానూ ‘జెర్సీ’ చిత్రానికి 21.61 కోట్ల షేర్ వచ్చింది.
‘జెర్సీ’ మొదటి వారం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
వైజాగ్ – 1.83 కోట్లు
సీడెడ్ – 1.62 కోట్లు
కృష్ణా – 1.09 కోట్లు
వెస్ట్ – 0.75 కోట్లు
నెల్లూరు – 0.50 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 15.34 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 1.75 కోట్లు
ఓవర్సీస్ – 4.55 కోట్లు
–
వరల్డ్ వైడ్ టోటల్ – 21.61 కోట్లు (షేర్)
————————————————–
‘జెర్సీ’ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 26 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారానికి ఈ చిత్రం 21.61 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి లారెన్స్ ‘కాంచన3’ చిత్రం ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఆ చిత్రం బి, సి సెంటర్స్ లో ‘జెర్సీ’ ని పెద్ద దెబ్బే కొట్టింది. అందులోనూ తాజాగా విడుదలైన ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ దెబ్బ మరింతగా కొట్టింది. దీంతో ఇప్పటి వరకూ మల్టీ ప్లెక్సుల్లో అయినా.. మంచి కలెక్షన్లను రాబట్టిన ‘జెర్సీ’ చిత్రం.. ‘అవెంజర్స్’ రాకతో మరింత దెబ్బతిందని చెప్పాలి. ఈ లెక్కన చూస్తుంటే.. ఫుల్ రన్లో ‘జెర్సీ’ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం కష్టంగానే కనిపిస్తుంది.