మొదటి మూడు రోజులు ఓకే అనిపించిన ‘జెర్సీ’..!

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మాణంలో ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘జెర్సీ’. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ సంగీతమందించిన ఈ చిత్రం ఏప్రిల్ 19 న(నిన్న) విడుదలయ్యింది. మొదటి షో తోనే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మొదటి మూడు రోజులకి గానూ ‘జెర్సీ’ చిత్రానికి 15.83 కోట్ల షేర్ వచ్చింది.

‘జెర్సీ’ మొదటి మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 4.92 కోట్లు
వైజాగ్ – 1.31 కోట్లు
సీడెడ్ – 1.01 కోట్లు
ఈస్ట్ – 0.86 కోట్లు
కృష్ణా – 0.77 కోట్లు
గుంటూరు – 0.82 కోట్లు
వెస్ట్ – 0.63 కోట్లు
నెల్లూరు – 0.36 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 10.68 కోట్లు
రెస్ట్ అఫ్
ఇండియా – 1.35 కోట్లు
ఓవర్సీస్ – 3.80 కోట్లు
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 15.83 కోట్లు (షేర్)
————————————————–

‘జెర్సీ’ చిత్రానికి 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 26 కోట్లకు పైగా షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి మూడు రోజులకి గానూ ఈ చిత్రం 15.83 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ చిత్రానికి ఈరోజు నుండీ అసలు పరీక్ష మొదలుకానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా వసూళ్ళు రాబడుతుందో చూడాలి. లారెన్స్ ‘కాంచన3’ చిత్రం పోటీ లేకుండా ఉంటే ఈపాటికే 20 కోట్ల వరకూ వచ్చేసేది అనడంలో సందేహం లేదు. బి,సి సెంటర్స్ లో ‘జెర్సీ’ కలెక్షన్ల పై ‘కాంచన 3’ ఎఫెక్ట్ పడింది. అయితే 2 వ వారం కూడా కొత్త సినిమాలేమీ లేకపోవడం ‘జెర్సీ’ చిత్రానికి కలిసొస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక మొదటి వారం పూర్తయ్యేసరికి ‘జెర్సీ’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus