సంక్రాంతి పందెం కోసం నాని సినిమా పోస్ట్ పోన్!

నిర్మాతగా దిల్ రాజుకు ఎదురునిలిచే మొనగాడు ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎంత పెద్ద సినిమా అయినా దిల్ రాజు ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నాడంటే.. ఆ డేట్ కి ఒకవారం ముందు లేదా తరవాత తమ సినిమాని రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా చేయరు. దిల్ రాజు కూడా తాను ఒక్కసారి ఎనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ను మార్చడానికి ఎప్పుడూ మార్చని దిల్ రాజు మొట్టమొదటిసారిగా ప్రోడక్ట్ రెడీగా పెట్టుకొని కూడా తన సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు.

విషయం ఏంటంటే.. నాని టైటిల్ పాత్రలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన “ఎం.సి.ఎ” నిజానికి డిసెంబర్ 21న విడుదలకావాల్సి ఉంది. కానీ.. డిసెంబర్ 22న అక్కినేని అఖిల్ రెండో సినిమా “హలో” రిలీజావుతుండడాన్ని దృష్టిలో పెట్టుకొని తన సినిమాని పోస్ట్ పోన్ చేయనున్నాడట దిల్ రాజు. అయితే.. దాని అదునుగా తీసుకొని పవన్ కళ్యాణ్ తో పోటీపడడానికి సన్నద్ధమవుతున్నాడు. సంక్రాంతి కానుకగా నాని “ఎం.సి.ఎ”ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట దిల్ రాజు. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వకపోయినప్పటికీ.. సంక్రాంతికి దిల్ రాజు సినిమా రంగంలోకి దిగడంతో.. అదే సమయంలో రిలీజావుతున్న “అజ్ణాతవాసి”, “జై సింహా” చిత్రాలు కాస్త టెన్షన్ పడే అవకాశం ఉంది.

సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి.. పోయిన సంక్రాంతికి వచ్చిన “ఖైదీ నం.150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభావతి” చిత్రాలు విజయం సొంతం దక్కించుకొని ఉండడం వంటి విషయాలను పరిశీలనలోకి తీసుకొని 2018 సంక్రాంతి కూడా సేమ్ రిజల్ట్ రిపీటవ్వాలని కోరుకొందాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus