నాని (Nani) , నివేదా థామస్ (Nivetha Thomas) కాంబినేషన్లో ‘జెంటిల్మన్’ తర్వాత వచ్చిన చిత్రం ‘నిన్ను కోరి’ (Ninnu Kori) . శివ నిర్వాణ (Shiva Nirvana) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty )కూడా కీలక పాత్ర పోషించాడు. ‘డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్’ ‘కోన ఫిలిం కార్పొరేషన్’ సంస్థల పై డివివి దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని నిర్మించగా…కోన వెంకట్ (Kona Venkat) స్క్రీన్ ప్లే అందించి సహనిర్మాతగా నిలిచారు. 2017 వ సంవత్సరం జూలై 7న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ నే రాబట్టుకుని.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.
గోపీసుందర్ (Gopi Sundar) సంగీతం, నాని నటన, క్లైమాక్స్ .. ఈ సినిమా సక్సెస్ లో మేజర్ రోల్ పోషించాయి. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :
నైజాం | 9.55 cr |
సీడెడ్ | 2.75 cr |
ఉత్తరాంధ్ర | 3.25 cr |
ఈస్ట్ | 1.80 cr |
వెస్ట్ | 1.15 cr |
కృష్ణా | 1.55 cr |
గుంటూరు | 1.50 cr |
నెల్లూరు | 0.65 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.90 cr |
ఓవర్సీస్ | 3.46 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 28.56 cr (షేర్) |
‘నిన్ను కోరి’ రూ.22.37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద రూ.28.56 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ సినిమా రూ.6.19 కోట్ల లాభాలు అందించింది. పోటీగా ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా ఈ సినిమా స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి.