న్యాచురల్ స్టార్ నాని…ఈ పేరు వింటే చాలు యూత్ నుంచి, ఫ్యామిలీ వరకూ అందరూ మన ఇంట్లో కుర్రాడూ అంటూ అక్కున చేర్చుకుంటారు. అయితే టాలీవుడ్ లో ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగిన చాలా మందిలో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి, టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగిన నాని, ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం అనే చెప్పాలి. స్పీడ్ గా సినిమాలు చెయ్యడం మాత్రమే కాకుండా, అంటే స్పీడ్ లో మంచి హిట్స్ అందుకుంటూ, ముందుకు దూసుకుపోతున్న హీరో నాని. ఇదిలా ఉంటే సరికొత్త కధలతో, డిఫ్ఫ్రెంట్ జొనర్ కామెడీ తో ఎప్పుడూ అందరినీ అలరించే నాని, ఇప్పుడు తాజాగా ‘నిన్ను కోరి’ అంటూ మనల్ని పలకరించనున్నాడు.
అయితే ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న క్రమంలో టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కధ లీక్ అయ్యింది. అయితే అసలు లీక్ అయిన కధ ఏంటి అంటే, నానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే నానితో కాకుండా ఆ అమ్మాయికి వేరే పర్సన్‌తో పెళ్ళయిపోతుంది. అయితే, నానీ మాత్రం ఇంకా ఆ అమ్మాయినే ప్రేమిస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఈ విషయాన్ని ఆ అమ్మాయికి, అంతేకాకుండా ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్న వాడికి అందరికీ చెప్పి ఫైనల్‌గా ఆ అమ్మాయిని చేరుకుని, తనదాన్ని ఎలా చేసుకున్నాడు అన్నదే ఈ సినిమా కధ. అయితే కధ పాతదే, పైగా పాత చింతకాయ పచ్చడి లాగా చాలా సార్లు విన్న కధ లాగానే ఉంది, కానీ కధనంతో కాస్త కసరత్తు చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. మరి ఆల్‌రెడీ వచ్చిన కధతో నాని ఎలాంటి ట్విష్ట్ ఇస్తాడో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.