మహేష్ కంటే నాని రెమ్యూనరేషన్ ఎక్కువ… ఎలా…?

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి… ఆ తరువాత ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు నేచురల్ స్టార్ నాని. ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడంలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు హస్తం కూడా ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు భజనతోనే సినిమా సాగుతుంది. ఈ చిత్రంతో మహేష్ ఫ్యాన్స్ కూడా ఖుషి చేసుకున్నారు. ఇక ఈ చిత్రానికి నాని రెమ్యూనరేషన్ కేవలం 10 వేల రూపాయలు మాత్రమే అని అప్పట్లో టాక్ నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నాని రెమ్యూనరేషన్.. మన సూపర్ స్టార్ మహేష్ ను మించి ఉంటుందని తెలుస్తుంది. మహేష్ మానియా తో హీరో అయ్యి… ఇప్పుడు మహేష్ ని మించి రెమ్యూనరేషన్ అందుకోవడం ఏంటి అనేగా మీ డౌట్..?

విషయంలోకి వెళితే నాని ఏడాదికి 2 లేక మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒక్కో చిత్రానికి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవడంతో పాటూ లాభాల్లో 30 శాతం వాటా కూడా తీసుకుంటున్నాడట. అది సుమారు 4 కోట్ల వరకూ ఉండబోతుందని సమాచారం. అంటే మొత్తంగా సినిమాకి వచ్చి 12 కోట్లన్నమాట. ఇక రెండు చిత్రాలకి అయితే 24 కోట్లు, 3 చిత్రాలైతే 36 కోట్లు వరకూ నాని సంపాదిస్తున్నాడన్న మాట. ఇక మహేష్ బాబు ఒక్కో సినిమాకి 20 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సంవత్సరానికి కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉంటుంది. ఇక యాడ్స్ నుండీ వచ్చే రాబడి 5 – 10 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

ఇలా మొత్తం కలిపి 30 కోట్లు అనుకున్నా… నాని రెండు సినిమాలు పూర్తి చేసి… తరువాతి సినిమా లైన్లో పెట్టేస్తాడు కాబట్టి 30 కోట్లపైనే నాని సంవత్సరం సంపాదన ఉంటుందని సమాచారం. ఈ లెక్కన మహేష్ కంటే నాని నే ఎక్కువ సంపాదిస్తున్నాడన్న మాట. ఇక ఇప్పటికే నాని దగ్గర చాలా మంది ప్రొడ్యూసర్ల అడ్వాన్సులు ఉన్నాయట. ఇంకో రెండు… మూడు… సంవత్సరాలు కూడా నాని బిజీ అయిపోయాడని తెలుస్తుంది. మీడియం లెవెల్ హీరో అయినా… మినిమం గ్యారంటీ హీరో… అందులోనూ స్క్రిప్ట్, నిర్మాత పెట్టే బడ్జెట్ ఇలా అన్ని డ్యూటీలు నాని నే చేస్తాడంట.

ఇంతలా కష్టపడే నానితో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు దైర్యంగా ముందడుగు వేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రం ఒక్కటే నానికి పెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ వంటి పెద్ద చిత్రాల మధ్యలో రావడం వలన… ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఇక ‘దేవదాస్’ ప్లాప్ అయినప్పటికీ డిజిటల్ రైట్స్ మరియు సాటిలైట్ రైట్స్ తో నిర్మాతకి లాభాలే అందాయట. నాని ఇదే ఫామ్లో ఉంటే భవిష్యత్తులో స్టార్ హీరోలను మించేస్తాడు అనడం అతిశయోక్తి కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus