‘ఎన్టీఆర్’ సెంచురీ కొట్టాడు!!!

  • April 22, 2016 / 06:51 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్…టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నా…వారిలో ఎన్టీఆర్ కు ప్రత్యేక స్థానం ఉంది అనే చెప్పాలి. మాస్ ప్రేక్షకుల గుండెల్లో దేవుడుగా, రికార్డులకు రారాజుగా ఎన్టీఆర్ ను కొలుస్తారు ఆయన అభిమానులు. ఇక ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో అన్నీ వైవిధ్యమైన పాత్రలే చేశాడు ఎన్టీఆర్. అయితే గతంలో కొన్ని వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ పక్కకు నెట్టి ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకుంటున్నాడు. అదే క్రమంలో గత ఏడాది విడుదలైన ‘టెంపర్’ చిత్రంలో తన మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా, ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించాడు.

రివెంజ్ డ్రామాగా విడుదలయ్యి భారీ హిట్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు ఎన్టీఆర్ కెరీర్ లో 50 కోట్లు కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రంగా మిగిలిపోయింది. మరో పక్క తాజాగా వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా..ఆదోనిలో సత్యం థియేటర్లో ఇంకా రన్ అవుతూ ఉండడం విశేషం. ఇక అదే క్రమంలో ఈరోజు ఈ చిత్రం యొక్క శతాదినోత్సవ వేడుకలను అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో హైలైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ యువతకు కిర్రెక్కించింది, కుర్రకారు అంతా ఆ లుక్ ని ఫాలో అయిపోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఎన్టీఆర్ పాడిన పాట..’ఐ వాన్న ఫాలో ఫాలో యూ’ భారీ హిట్ అయ్యీ ఎన్టీఆర్ కు కన్నడ, హిందీ బాషల్లో పాట పదే అంత స్థాయికి తీసుకెళ్లింది. మరి త్వరలో రానున్న జనతా గ్యారేజ్ కూడా ఇలానే భారీ హిట్ కావాలని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus