రూల్ మూవీ పాటలను విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు

శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ సోనా పటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్య నారాయణ నిర్మిస్తున్న చిత్రం రూల్ ( ది పవర్ అఫ్ పీపుల్ ) ఈ చిత్రం నవంబర్ 9 న విడుదలకు సిద్దమవుతుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో బిగ్ సి డి ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదలచేశారు.దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్ ను, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను, ప్రొడ్యూసర్ అశ్వినిదత్ టీజర్ ను, డైరెక్టర్ బోయపాటి శ్రీను ట్రైలర్ ను లాంచ్ చేసారు. ఈ

సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ… రూల్ ( ది పవర్ అఫ్ పీపుల్ ) ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇంత మంది సినీ రాజకీయ ప్రముఖులు నన్నూసపోర్ట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు, కథ విషయానికి వస్తే హీరో ఒక యువజన నాయకుడు తన కుటుంబంతో పాటు ఎన్నోకుటుంబాలకు అన్యాలను ఏ నిరుపెదలకు జరగకుండా ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్ర కథాంశం , చిత్రంలో నాలుగు పాటలున్నాయి , రమణ సాయి ని సంగీత దర్శకుడి పరిచయం చేస్తున్నాం, హైదరాబాద్ , వైజాగ్ , అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామన్నారు.

నిర్మాత మాట్లాడుతూ… ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యమనీ , మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యమనీ తెలియజేసే మంచి మెసేజ్ చిత్రాన్ని నిర్మిచానని , ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది ఈ నెలలో సెన్సార్ కంప్లీట్ చేసి నవంబర్ 9 న సినిమా విడుదల చేస్తామన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus