ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహేష్ బాబు పుట్టినరోజు గురించి హాట్ టాపిక్ అయ్యేలా చేశాడు రాజమౌళి.వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సెట్స్ పైకి వెళ్లి చాలా నెలలు అయ్యింది. కానీ ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా బయటకు రానివ్వలేదు జక్కన్న.
మరోపక్క మహేష్ బాబు తన తండ్రి కృష్ణ పుట్టినరోజుకి, తన పుట్టినరోజుకి.. తాను నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం రివాజు. కానీ రాజమౌళితో చేస్తున్న సినిమా విషయంలో అలాంటివి జరగడం లేదు. ఈ విషయంలో మహేష్ బాబు టీం కూడా రాజమౌళికి పూర్తిగా సరెండర్ అయ్యింది. సో మహేష్ పుట్టినరోజుకి కూడా ఎటువంటి అప్డేట్ ఉండదు అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ‘అతడు’ రీ రిలీజ్ తోనే మహేష్ బాబు పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నారు.
కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చాలా సైలెంట్ గా ‘#SSMB29’ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు రాజమౌళి. ‘కొన్నాళ్ళ క్రితమే ఈ చిత్రాన్ని ప్రారంభించాము. ఈ సినిమా అప్డేట్స్ కోసం మీరు కనబరిచే ఆసక్తిని గమనిస్తూనే ఉన్నాము. ఈ సినిమా కథ ఏంటి, దీని స్థాయి ఏంటి? వంటివి తెలుసుకోవాలనే మీ తపన మాకు అర్థమైంది.అయితే ఫోటోలు లేదా ప్రెస్ మీట్లు మాత్రమే ఈ ప్రాజెక్టు గొప్పతనం గురించి వివరిస్తాయి అని మేము అనుకోవడం లేదు. ఈ సినిమా వరల్డ్ ను, ఈ కథలోని సోల్ ను, 2025 నవంబర్‌లో మీకు తెలియజేస్తాం. మీ సహనానికి హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ రాజమౌళి ఓ లెటర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. సో మహేష్ – రాజమౌళి సినిమా ఫస్ట్ అప్డేట్ నవంబర్లో రాబోతోంది అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది.
For all the admirers of my #GlobeTrotter… pic.twitter.com/c4vNXYKrL9
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025
The First Reveal in November 2025… #GlobeTrotter pic.twitter.com/MEtGBNeqfi
— rajamouli ss (@ssrajamouli) August 9, 2025