నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ తో ప్రేక్షకులను అలరించాడు. వాస్తవానికి ‘సరిపోదా శనివారం’ తర్వాత అతను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది పారడైజ్’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టి.. ‘హిట్ 3’ కి డేట్స్ ఇచ్చాడు. దానికి నానినే నిర్మాత అనే సంగతి తెలిసిందే.మే 1న రిలీజ్ అయిన ‘హిట్ 3’ మంచి టాక్ తెచ్చుకుంది.
బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. క్లీన్ హిట్ అనిపించుకుంది. దీని తర్వాత ‘ది పారడైజ్’ షూటింగ్ ను నాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని భావించాడు. ఇందులో నెవర్ బిఫోర్ లుక్లో నాని కనిపించబోతున్నట్టు చాలా కాలంగా టాక్ నడుస్తుంది.
ఆల్రెడీ కొంత పోర్షన్ షూటింగ్ కూడా జరిగింది. ఆగస్టు 8న ‘ది పారడైజ్’ నుండి నాని లుక్ కి సంబంధించిన పోస్టర్ వదిలే అవకాశం ఉంది. మరోపక్క ఈ సినిమా షూటింగ్ కి అనుకోని ఇబ్బంది వచ్చి పడినట్టు టాక్ నడుస్తుంది. అదేంటంటే.. ‘ది పారడైజ్’ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారట. ‘ది పారడైజ్’ కి అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుండటంతో.. ఆయన ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఆయన కెరీర్లో ‘దసరా’ మాత్రమే మంచి విజయాన్ని అందుకుంది. అదే కాంబినేషన్లో ఇప్పుడు పారడైజ్ చేస్తున్నారు. ఆ నమ్మకంతో సినిమాకు రూ.150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టడానికి ఆయన రెడీ అయ్యారు. కానీ మధ్యలో ప్లాపులు ఆయన్ని వెంటాడాయి. రవితేజ – కిషోర్ తిరుమల సినిమాను కూడా ఆయన హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తుంది. మరోపక్క బాలయ్య- గోపీచంద్ మలినేని ప్రాజెక్టును కూడా ఆయన నిర్మించాల్సి ఉంది.